నేడు సీ ప్లేన్‌లో శ్రీశైలంకు సీఎం చంద్రబాబు

  • సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
  • పున్నమి ఘాట్ నుంచి సీ ప్లేన్‌లో శ్రీశైలంకు వెళ్లనున్న సీఎం
  • శ్రీశైలం మల్లన్న దర్శనం అనంతరం సీ ప్లేన్‌లోనే తిరిగి విజయవాడకు రానున్న సీఎం చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు విజయవాడ పున్నమి ఘాట్ వద్ద సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. పున్నమి ఘాట్ నుండి సీ ప్లేన్‌లో చంద్రబాబు ఇతర మంత్రులు ప్రయాణించి శ్రీశైలం చేరుకోనున్నారు. 

ఈ రోజు ఉదయం 10.45 గంటలకు సీఎం చంద్రబాబు పున్నమి ఘాట్ కు చేరుకుని ..12 గంటలకు సీ ప్లేన్‌లో ప్రయాణం ప్రారంభించి 12.45 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటారు. శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జునస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం తిరిగి 2.20 గంటలకు సీ ప్లేన్ ‌లో బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు విజయవాడ పున్నమిఘాట్‌కు చేరుకుంటారు. 

కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం పర్యటన నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు చంద్రబాబు సీ ప్లేన్‌ను లాంఛనంగా ప్రారంభించి.. శ్రీశైలం ప్రయాణించనున్న నేపథ్యంలో నిన్న సీ ప్లేన్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ట్రయల్ రన్ విజయవంతం అయ్యింది.  

Chandrababu
sea plane
sea plane tourism
Vijayawada

More Telugu News